టెన్త్‌ విద్యార్థినిపై బాలుడి లైంగికదాడి | Sexual assault | Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థినిపై బాలుడి లైంగికదాడి

Jul 25 2016 11:54 PM | Updated on Jul 23 2018 9:13 PM

బాలికను కిడ్నాప్ చేసి.. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడో బాలుడు. నిందితుడిని అరెస్టు జువైనల్‌ కోర్టుకు తరలించారు.

లంగర్‌హౌస్‌: బాలికను కిడ్నాపై చేసి.. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడో బాలుడు. నిందితుడిని అరెస్టు జువైనల్‌ కోర్టుకు తరలించారు. లంగర్‌హౌస్‌ ఎస్సై మహమ్మద్‌ జాహెద్‌ తెలిపిన వివరాల ప్రకారం... టోలిచౌకి పారమౌంట్‌ కాలనీకి చెందిన బాలిక (13) స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గోల్కొండ ప్రాంతంలో నివాసముండే ఓ బాలుడు (17) టోలిచౌకిలోని మొబైల్‌ షాపులో పని చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం తండ్రి సెల్‌ఫోన్‌ రీఛార్జి చేయించడానికి బాలిక ఆ మొబైల్‌ దుకాణానికి వెళ్లింది.

 

అప్పటి నుంచీ బాలుడు ఆమె వెంటపడి ప్రేమించాలని వేధిస్తున్నాడు. వారం క్రితం బాలిక తండ్రి అనారోగ్యానికి గురికావడంతో నానల్‌నగర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రిని చూడటానికి ఓ రోజుల బాలికి ఆసుపత్రికి వెళ్లడం బాలుడు గమనించాడు.  శనివారం ఆసుపత్రి వద్ద కాపుకాసి బాలికను ఆమె తండ్రి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ మాటలు కలిపాడు. ఆమెకు మాయమాటలు చెప్పి శంకర్‌పల్లి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడి ఇంట్లో ఉంచి లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించి, సోమవారం ఉదయం బాలికను టోలిచౌకిలో వదిలి వెళ్లాడు.  బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. లంగర్‌హౌస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని జువైనల్‌ జస్టిస్‌ కోర్టుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement