ప్రపంచ శాంతి కోసం ర్యాలీ | Rally for World Peace | Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతి కోసం ర్యాలీ

Feb 5 2017 11:15 PM | Updated on Sep 5 2017 2:58 AM

ప్రపంచ శాంతి కోసం ర్యాలీ

ప్రపంచ శాంతి కోసం ర్యాలీ

ప్రపంచ శాంతిని కోరుతూ కర్నూలు నగరంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. లూర్ధుమాత పండుగను పురస్కరించుకొని ఆదివారం మేరిమాత తేరును.. చిల్డ్రన్స్‌ పార్క్‌ దగ్గర ఉన్న సెయింట్‌ థెరిస్సా చర్చి నుంచి రాజ్‌విహార్‌, కలెక్టరేట్‌, సీ.క్యాంపు మీదుగా నంద్యాల చెక్‌పోస్ట్‌ దగ్గర ఉన్న సెయింట్‌ లూర్ధుస్‌ కథిడ్రల్‌ వరకు ఊరేగించారు.

కర్నూలు (న్యూసిటీ) : ప్రపంచ శాంతిని కోరుతూ కర్నూలు నగరంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. లూర్ధుమాత పండుగను పురస్కరించుకొని ఆదివారం మేరిమాత తేరును.. చిల్డ్రన్స్‌ పార్క్‌ దగ్గర ఉన్న సెయింట్‌ థెరిస్సా చర్చి నుంచి రాజ్‌విహార్‌, కలెక్టరేట్‌, సీ.క్యాంపు మీదుగా నంద్యాల చెక్‌పోస్ట్‌ దగ్గర ఉన్న సెయింట్‌ లూర్ధుస్‌ కథిడ్రల్‌ వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్‌ కోల విజయరాజు మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌ దేశంలోని లూర్ధునగరంలో మేరిమాత ప్రత్యక్షమై ప్రపంచశాంతి కోసం దేవున్ని ప్రార్థించాలని బెర్నెదెత్తె అనే బాలికకు తెలిపిందన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలో ప్రపంచంలో శాంతి వర్ధిల్లాలని ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. లూర్ధుమాత ఉత్సవాల్లో చివరి రోజైన ఫిబ్రవరి 11న జరిగే వేడుకలకు నగర ప్రజలందరూహాజరై ప్రపంచశాంతికోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జి.లూర్ధయ్య బృందం ఆలపించిన పాటలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో మరియదళ సభ్యులు, యూత్‌, క్యాథలిక్‌ అసోసియేషన్‌ సభ్యులు, ఫాదర్లు, సిస్టర్లు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement