రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | person died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Nov 30 2016 2:35 AM | Updated on Aug 30 2018 4:07 PM

మండలంలోని పారాపురం గ్రామానికి చెందిన అల్లు గోవిందరావు(28) శ్రీకాకుళం రూరల్ మండలం ఆర్టీసీ క్రాంతినగర్ సమీపంలో సోమవారం

కొత్తూరు : మండలంలోని పారాపురం గ్రామానికి చెందిన అల్లు గోవిందరావు(28) శ్రీకాకుళం రూరల్ మండలం ఆర్టీసీ క్రాంతినగర్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో పారాపురంలో విషాదం అలముకొంది. మోటారు సైకిల్ ప్రమాదంలో మృతి చెందిన గోవిందరావుకు ఏడాదిన్నర కిందట వివాహమైంది. ఈయనకు భార్య రోహిణి, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. మృతుడు కొత్తూరులో ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాడు. గోవిందరావు మృతితో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement