స్వార్థపరులే పార్టీని వీడారు | only cheaters joined other parties | Sakshi
Sakshi News home page

స్వార్థపరులే పార్టీని వీడారు

Oct 15 2016 10:21 AM | Updated on Mar 18 2019 9:02 PM

కొందరూ వారి స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని మోసం చేసి వెళ్లిపోయారని కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మ¯ŒS గొల్లపల్లి కుమారస్వామి అన్నారు.

నర్మెట : కొందరూ వారి స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని మోసం చేసి వెళ్లిపోయారని కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మ¯ŒS గొల్లపల్లి కుమారస్వామి అన్నారు. ఎంతో నమ్మకంతో వారికి పదవులను  కట్టబెట్టిన మోసంచేవారన్నారు.  కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భూక్య జూంలాల్‌నాయక్, చేర్యాల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అర్జుల సుధాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరడంపై గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

కుమారస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తల్లిలాంటిదని అన్నారు. పార్టీ పదవులతో అన్నివిధాలుగా అభివృద్ధి చెంది  ఇప్పుడు పార్టీని వీడటం సరైంది  కాదన్నారు.  కాంట్రాక్టుల కోసమే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారని అన్నారు. వారు పార్టీని వీడటం వల్ల  అధినాయకత్వానికి కాని, పార్టీకి కాని  ఏలాంటి నష్టం లేదన్నారు. వారి స్థానాలను త్వరలోనే క్రీయశీలకంగా పనిచేసే కార్యకర్తలకు అప్పగిస్తామని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కొంపెల్లి రమేష్, ప్రజ్ఞపురం కనుకయ్య, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement