రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య | one person suicide | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య

Aug 14 2016 12:02 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

డోర్నకల్‌ : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. డోర్నకల్‌ జీఆర్‌పీ ఎస్‌ఐ పెండ్యాల దేవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఎల్లంపల్లి సత్యనారాయణ(55) నవభారత్‌ సంస్థలో క్యాజువల్‌ లేబర్‌గా పని చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సత్యనారాయణ శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లాలోని పాండురంగాపురం, గాజులగూడెం రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement