చెట్టును ఢీకొన్న కారు..ఒకరి మృతి | one killed in road accident in karimnagar district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు..ఒకరి మృతి

Jul 27 2016 9:49 AM | Updated on Aug 30 2018 4:07 PM

కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల క్రాసింగ్ వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల క్రాసింగ్ వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32)  అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement