లారీని ఢీకొని యువకుడి దుర్మరణం | One killed in road accident | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొని యువకుడి దుర్మరణం

Dec 1 2016 1:27 AM | Updated on Aug 30 2018 4:07 PM

లారీని ఢీకొని యువకుడి దుర్మరణం - Sakshi

లారీని ఢీకొని యువకుడి దుర్మరణం

వెంకటగిరి: ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బంగారుపేట తెలుగుగంగ కాలువ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది.

 వెంకటగిరి: ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బంగారుపేట తెలుగుగంగ కాలువ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్‌ జిల్లా రామాపురం మండలానికి చెందిన నోముల చిన వెంకటేష్‌ (21) నెల్లూరులోని ఓ స్వీట్‌ బేకరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటగిరి సమీపంలోని ఇలగనూరులో ఉన్న తన బంధువుల ఇంటికి మంగళవారం  మోటారుబైక్‌పై వచ్చాడు. బుధవారం తెల్లవారు.జామున నెల్లూరుకు బయలుదేరారు. బంగారుపేట సమీపంలో మరమ్మతులకు గురై రోడ్డుపై ఆగి ఉన్న లారీని అదుపు తప్పి ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన లారీ సిబ్బంది 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్‌ పరీక్షించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడి వద్ద లభించిన బేకరీ బిల్లుపై ఉన్న ఫోన్‌ నంబరు ఆధారంగా వెంకటేష్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి   కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement