కారు ఢీకొని వ్యక్తి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి మృతి

Sep 18 2016 10:32 PM | Updated on Aug 30 2018 4:10 PM

కారు ఢీకొని వ్యక్తి మృతి - Sakshi

కారు ఢీకొని వ్యక్తి మృతి

చిల్లకూరు : ‘నాకు పనుంది బైక్‌పై నెల్లూరు వెళ్తా.. మీరు ఆటోలో వచ్చేయండి’ చెప్పిన వ్యక్తి కొంతసేపటికి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. సంఘటన మండలంలోని కోట క్రాస్‌ రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

 
చిల్లకూరు : ‘నాకు పనుంది బైక్‌పై నెల్లూరు వెళ్తా.. మీరు ఆటోలో వచ్చేయండి’ చెప్పిన వ్యక్తి కొంతసేపటికి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. సంఘటన మండలంలోని కోట క్రాస్‌ రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు నెల్లూరు శ్రామిక్‌నగర్‌కు చెందిన ఎంబేటి మురళి (30) లారీ డ్రైవర్‌గా పనిచేన్నాడు. అతని భార్య పోలమ్మ, తమ ముగ్గురు పిల్లలైన చరిత, ఏసు, శరత్‌కుమార్‌లను మోటార్‌బైక్‌పై ఎక్కించుకుని ఆదివారం గూడూరు మండలం అయ్యవారిపాళెంలోని బంధువుల ఇంటి వచ్చారు. పోలమ్మ అక్క పిల్లలు చిట్టేడు గిరిజన గురుకుల పాఠశాలలో చదవుతుండగా వారిని చూసేందుకు బంధువులతో కలిసి భార్య పిల్లలను ఆటోలో చిట్టేడుకు పంపాడు. మురళి బైక్‌పై వెళ్లినప్పటికీ అర్జెంటు పని ఉందని చిట్టేడు నుంచి ఒంటరిగానే నెల్లూరుకు బయలుదేరి  ఆటోలో భార్య, పిల్లలను నెల్లూరుకు రావాలని చెప్పాడు. ఈ క్రమంలో మురళి కోట క్రాస్‌రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా చెన్నె వైపు నుంచి వేగంగా వస్తున్న బైక్‌ను గమనించకుండా ఢీకొట్టింది. ఈ ఘటనలో మురళి అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుకనే ఆటోలో వస్తున్న భార్య, పిల్లలు అక్కడి చేరకుని మృతదేహాన్ని చూసి బోరు విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై అంకమ్మ సంఘటనా స్థలానికి చేరకుని వివరాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement