రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

May 31 2016 12:01 PM | Updated on Aug 30 2018 4:07 PM

వ్యాను బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.

వ్యాను బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం వెంకటాపురంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొల్లేరు వైపు చేపల మేత లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న పిళ్లా మోహన్‌రావు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్‌ను తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. మోహన్‌రావు స్వగ్రామం మండలంలోని భువనపల్లి.

 

Advertisement
 
Advertisement
Advertisement