కనిగిరిలో రోడ్డు ప్రమాదం..ఒకరికి గాయాలు | One injured in road accident | Sakshi
Sakshi News home page

కనిగిరిలో రోడ్డు ప్రమాదం..ఒకరికి గాయాలు

Sep 1 2016 6:28 PM | Updated on Aug 30 2018 4:07 PM

కనిగిరి మండలకేంద్రంలోని ఏవీఆర్ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

కనిగిరి మండలకేంద్రంలోని ఏవీఆర్ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజీ వైపు వెళ్తున్న ఓ కారు టైరు పంక్చరై ముందున్న మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటారుసైకిల్‌పై ప్రయాణిస్తున్న మల్లికార్జున్ అనే వ్యక్తి కాలుకు తీవ్రగాయమైంది. దీంతో భయపడిన కారు డ్రైవర్ దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు వేగంగా పోనిచ్చాడు. స్థానికులు వెంటపడి అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లికార్జున్‌ను ప్రాధమిక చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్‌కు రిఫర్ చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement