రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | one dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Sep 7 2017 10:04 PM | Updated on Aug 30 2018 4:15 PM

మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారిపై కారుబోల్తాపడి గుంటూరు జిల్లాకు చెందిన రాధాకృష్ణరెడ్డి (36) అనే వ్యక్తి చనిపోగా మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు.

గోరంట్ల(సోమందేపల్లి): మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారిపై కారుబోల్తాపడి గుంటూరు జిల్లాకు చెందిన రాధాకృష్ణరెడ్డి (36) అనే వ్యక్తి చనిపోగా మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. గురువారం గుంటూరు నుంచి అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్తుండగా కారు జాతీయ ర హదారిపై ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న రాధాకృష్ణరెడ్డికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటరెడ్డి, రాజేశ్వరయ్యలతో పాటు డ్రైవర్‌ చైతన్యలు తీవ్రంగా గాయపడగా ప్రథమ చికిత్స కోసం వారిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. డ్రైవర్‌ అజాగ్రత్తవల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ బాలాజి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement