రైళ్లు ఆలస్యం | Odisha bandh results delay of trains | Sakshi
Sakshi News home page

రైళ్లు ఆలస్యం

Aug 16 2016 8:08 PM | Updated on Sep 4 2017 9:31 AM

రైళ్లు ఆలస్యం

రైళ్లు ఆలస్యం

ఒడిశాలో మంగళవారం జరిగిన బంద్‌/రైల్‌రోకో కారణంగా ఈకో రైల్వే పరిధిలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. విశాఖపట్నం, దువ్వాడ మీదుగా రాకపోకలు సాగించాల్సిన రైళ్లు నిర్ణీత సమయంకన్నా.. అరగంట నుంచి 3 గంటలు ఆలస్యంగా చేరుకున్నాయి.

 ఒడిశా బంద్‌ ఫలితం
 
విశాఖపట్నం: ఒడిశాలో మంగళవారం జరిగిన బంద్‌/రైల్‌రోకో కారణంగా ఈకో రైల్వే పరిధిలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. విశాఖపట్నం, దువ్వాడ మీదుగా రాకపోకలు సాగించాల్సిన రైళ్లు నిర్ణీత సమయంకన్నా.. అరగంట నుంచి 3 గంటలు ఆలస్యంగా చేరుకున్నాయి. భువనేశ్వర్, ఖుర్దారోడ్, భద్రక్, ధెకెనాల్, సంబల్‌పూర్, కటక్, పూరి, టిట్లాఘర్‌ ప్రాంతాల్లో నిరసనకారులు ప్రదర్శన చేపట్టి 21 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 4 పాసింజర్‌ రైళ్లను నిలిపివేసినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.
 
  • భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌లో హౌరా–పూరి ఎక్స్‌ప్రెస్‌ (12887), హరిద్వార్‌–పూరి(18478)లను గంటసేపు నిలిపివేశారు.
  • ఖుర్దారోడ్‌లో భువనేశ్వర్‌– బెంగళూర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18463)ని మూడు గంటలు, హౌరా– వాస్కోడిగామా అమరావతి ఎక్స్‌ప్రెస్‌ (18047)ను కటక్‌లో గంట, ఖుర్దారోడ్‌లో అదే రైలుని మరో అరగంట, యశ్వంత్‌పూర్‌–ముజాఫర్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌(15228)ను కపిలాస్‌రోడ్డులో 3 గంటలు, పూరి–దుర్గ్‌(18426) ఎక్స్‌ప్రెస్‌ను నిర్గుండి వద్ద గంటన్నర, ధన్‌బాద్‌–భువనేశ్వర్‌(12831) గరీబ్‌రథ్‌ను ధేకెనాల్‌ వద్ద 3 గంటలు, హౌరా–చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌(12842)ను భువనేశ్వర్‌ వద్ద రెండుగంటలు, గురుదేవ్, పూరి–ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్, హౌరా–మైసూర్‌ ఎక్స్‌ప్రెస్, విశాఖ–అమృత్‌సర్, హౌరా–మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌లు 30 నుంచి గంట వ్యవధి మధ్యలో పలు స్టేషన్లలో నిలిపివేశారు. వీటితోపాటు పలు పాసింజర్‌ రైళ్లను భద్రక్, హిరాకుడ్, బుధాపంక్‌ ప్రాంతాల్లో నిలిపివేశారు. ఇవి ఆయా స్టేషన్లను ఆలస్యంగా చేరుకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement