చదువుకోలేక.. | not intrested in studies | Sakshi
Sakshi News home page

చదువుకోలేక..

Oct 22 2016 11:34 PM | Updated on Jul 11 2019 5:01 PM

చదువు ఇష్టం లేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో చోటు చేసుకుంది.

మంత్రాలయం రూరల్‌: చదువు ఇష్టం లేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో చోటు చేసుకుంది. మంత్రాలయం ఎస్‌ఐ శ్రీనివాస నాయక్‌ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్‌ ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె సంతానం. చివరి కుమారుడు రామకృష్ణ (18) తిరుపతిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి మొదటి నుంచి కుడా చదువు ఇష్టం లేదు. దసరా సెలవులకు గ్రామానికి వచ్చి కాలేజీకి వెళ్లనని పట్టుబడ్డాడు. అయితే వెళ్లాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో తీవ్ర మనస్తానికి గురై శుక్రవారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement