ధోనీపై నాన్బెయిలబుల్ వారెంట్ | non bailable warrant issued to ms dhoni by anantapur court | Sakshi
Sakshi News home page

ధోనీపై నాన్బెయిలబుల్ వారెంట్

Jan 8 2016 10:39 AM | Updated on Jun 1 2018 8:39 PM

ధోనీపై నాన్బెయిలబుల్ వారెంట్ - Sakshi

ధోనీపై నాన్బెయిలబుల్ వారెంట్

ఓ మేగజైన్ కవర్పేజీపై విష్ణుమూర్తి అవతారంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాన్ని ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన కేసు ధోనీని నీడలా వెంటాడుతోంది.

అనంతపురం: ఓ మేగజైన్ కవర్పేజీపై విష్ణుమూర్తి అవతారంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాన్ని ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన కేసు ధోనీని నీడలా వెంటాడుతోంది. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ సాగుతుండగా.. అనంతపురం కోర్టు ఇదే కేసులో ధోనీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నోటీసులు ఇచ్చినా ధోనీ హాజరుకాకపోవడంతో అనంతపురం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.  ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీహెచ్పీ నేత శ్యాంసుందర్ అనంతపురం కోర్టులో కేసు దాఖలు చేశారు.

బెంగళూరులో మరో వ్యక్తి ధోనీపై కేసు పెట్టారు. మత విశ్వాసాలను కించపరిచేలా ఈ ప్రకటన ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ధోనీ తీరుపై బెంగళూరు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనల్లో నటించే ముందు పర్యవసానాల గురించి ఆలోచించాలని సూచించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement