సామాన్యులకు నో ఎంట్రీ | No entry for comman man | Sakshi
Sakshi News home page

సామాన్యులకు నో ఎంట్రీ

Aug 15 2016 1:01 AM | Updated on Sep 4 2017 9:17 AM

స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా అనంతపురంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు చూసేందుకు సామాన్యులకు అవకాశం లేకుండా పోయింది.

అనంతపురం అర్బన్‌: స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా అనంతపురంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు చూసేందుకు సామాన్యులకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రస్థాయి వేడుకలు.. ఊళ్లోనే జరుగుతున్నాయి..మళ్లీ జరుగుతాయో లేదో ఒక్కసారైనా ఆ వేడుక ప్రత్యక్షంగా చూడాలనుకున్న వారందరి ఆశలపై అధికారులు నీళ్లు పోశారు.  
వేడుకలను తిలకించేందుకు సాధారణ ప్రజలకు రెండు వేల కార్డులు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నా, వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.   ప్రజల కోసం కేటాయించిన బీ–3 పాసులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చెంతకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో నాయకులంతా తమ అనుచరులకు, బంధువులకు పంచి పెట్టారు. దీంతో రాష్ట్రస్థాయి వేడుక కూడా అధికార పార్టీ కార్యక్రమంగా మారిపోయింది.  

Advertisement
 
Advertisement
Advertisement