breaking news
comman man
-
ఏంటి గువ్వల ఇది?
-
PakistanCrisis ‘ఓన్లీ వన్ మీల్...నో స్కూల్’ అల్లాడుతున్న జనం
ఇస్లామాబాద్:పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దేశ ప్రజలను వణికిస్తోంది. ఒక పూట తింటే మరో పూటకు లేక, పిల్లల్ని బడికి పంపించే దారిలేక నానా అవస్థలు పడుతున్నారు. దేశాన్ని ముంచెత్తిన వరదలు, రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి వరదలకు గోధుమ పంట మొత్తం నాశనం కావడంతో తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తింది. దీనికితోడు ప్రభుత్వ పన్నుల భారం పిడుగులా తాకింది డాన్ వార్తాపత్రిక కథనం ప్రకారం దీంతో ఒకప్పుడు మూడు పూటలా తినేవాళ్లం, కానీ ఇప్పుడు... ఒక్కసారే వండుకుని మూడు పూట్లకు సర్దుకుంటున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఒక్క పూట మాత్రమే తింటున్నామని.. పిల్లల్ని స్కూళ్లకు పంప లేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. చివరికి ఆహారాన్ని తగ్గించు కోవడమే కాదు మండుతున్న పెట్రోల్ ధరలతో, రెట్టింపైన టికెట్ల రేట్లతో ప్రయాణఖర్చుల్ని భరించలేక, ప్రయాణాల్నిమానివేసి కుటుంబాలకు దూరంగా జీవిస్తున్నారు. ఇళ్లల్లో పనులు చేసినందుకు గతంలో ఇంటికి 3 నుంచి 4 వేలు సంపాదించేది రుక్సానా బీబీ. కానీ ఇపుడదే నెల మొత్తం ఆదాయంగా వస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖర్చులు రెట్టింపైతే, ఆదాయం మాత్రం భారీగా పడిపోయింది. గోధుమ పిండి దొరక్క నానా అగచాట్లు పడుతున్నారు. ఒక బస్తా గోధుమ పిండి కోసం రోజుల తరబడి పిల్లలు లైన్లో నిలబడాల్సి వస్తోంది. ఒక వస్తువు కొంటే మరొకటి కొనలేకపోతున్నామని మరో సామాన్యుడి ఆవేదన ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ గత మూడేళ్లుగా తన ఆదాయంలో మార్పు రాలేదని ఇక పిల్లలను బడికి పంపే స్థోమత ఎక్కడదని వాపోయాడు.ద్రవ్యోల్బణం కారణంగా తన బిజినెస్ దెబ్బతిందని ఒక చిన్న దుకాణదారుడు నదీం ఉద్దీన్ సిద్దిఖీ చెప్పాడు. వారానికి రూ.50వేలయ్యే పెట్టుబడి కాస్తా లక్షకు పెరిగింది. మాలో మేం కుంచించుకు పోతున్నాం. ఇంతకుముందు నాలుగు కప్పుల టీ తాగితే, ఇప్పుడు ఒకటి తాగడమే కష్టంగా ఉందంటూ విచారం వ్యక్తంచేశారు. మరోవైపు పాక్స్తాన్ వీక్లీ ఇన్‌ప్లేషన్ 40శాతానికి పైగా ఎగిసింది. -
వైరల్‌గా.. సీఎం ఛాలెంజ్
ఆడంబరాలకు కాస్త దూరంగా ఉంటూ రాష్ట్రానికి అండగా ఉండాలనే ఆలోచనతో ఓ నెటిజన్ విసిరిన 'సీఎం ఛాలెంజ్' ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ కామన్‌మెన్(సీఎం) మరో కామన్‌మెన్‌కు విసిరిన ఛాలెంజే ఈ సీఎం ఛాలెంజ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడంబరాలకు పోకుండా దుబారా ఖర్చులు చేయకుండా పాలన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్‌ని ఆదర్శంగా తీసుకున్న ఆయన అభిమాని వెలగల సతీష్ రెడ్డి సీఎం ఛాలెంజ్ విసిరారు. అదేంటో తెలియాలంటే ఈ వీడియో వీక్షించండి. రాజకీయ నాయకులకి బహుకరించే బొకేలు, శాలువాలు, జరుపుకునే విజయోత్సవాలు వీటిలో నుండి కాస్త డబ్బుని ఆదా చేసి దానిని సీఎం రిలీఫ్ ఫండ్కిగానీ లేదా ఇతర రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించమని అతను కోరాడు. తనవంతు బాధ్యతగా రూ. 10 వేలని సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా ఇచ్చాడు. ఎవరైనా తనలా డబ్బు ఆదా చేసి విరళంగా ఇస్తే, ఆ రశీదుని సోషల్ మీడియాలో షేర్ చేసి దానికీ #cmchallenge అని ట్యాగ్ చేయమని కోరాడు. ఆ వీడియో సీఎం ఛాలెంజ్ పేరుతో సోషల్ మీడియాలో హలచల్ చేస్తూ నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది. -
వైరల్‌గా.. సీఎం ఛాలెంజ్
-
తమిళనాడులో రెచ్చిపోయిన పోలీసులు
-
బిగ్‌బాస్: మళ్లీ సామాన్యుడే టార్గెట్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్-2లో మళ్లీ సామాన్యుడే టార్గెట్ అయ్యాడు. ఏదైనా జరగొచ్చు.. హౌస్‌లో కామన్ మ్యాన్ అంటూ ఈ సారి వినూత్నంగా ప్రారంభమైన ఈ రియాల్టీ షోలో ఆ వ్యక్తికే చోటులేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. లక్షల మందికి ఆడిషన్స్ నిర్వహించి ఓ ముగ్గురిని హౌస్‌లోకి పంపించిన విషయం తెలిసిందే. రెండు వారాలు తిరక్కముందే ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. నిజానికి వారు ఎలిమినేషన్ అయ్యేంత చికాకేమి తెప్పించలేదు. వారి ఎమోషన్లను బయటపెడుతూ.. సెలబ్రిటీలకు తక్కువేమి కాదని నిరూపించారు. ఈ విషయంలో ఇదంతా బిగ్‌బాస్ స్క్రిప్టేనని, సెలబ్రిటీలంతా కలిసే ఇలా చేస్తున్నారని ప్రేక్షకులకు అనేక సందేహాలు కలిగాయి. ఎలిమినేషన్ ప్రక్రియ అంతా ప్రేక్షకుల నిర్ణయం మేరకే జరుగుతోందని హోస్ట్ నాని స్పష్టం చేసినా జనాలు నమ్మే స్థితిలో లేరనడానికి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్సే నిదర్శనం. రెండో వారం సీరియస్‌గా.. ఫన్నీగా నూతన నాయుడు ఎలిమినేషన్‌తో రసవత్తరంగా ముగిసింది. విజయవంతంగా మూడో వారంలో అడుగుపెట్టిన ఈ రియాల్టీషో.. సోమవారం జరిగిన ఎపిసోడ్లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో మళ్లీ అంతా కామన్ మ్యాన్ గణేశ్నే టార్గెట్ చేశారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గణేశ్ ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతూనే ఉన్నాడు. గత రెండు వారాలు ప్రజల మద్దతుతో హౌస్‌లో ఉండిపోయాడు. అయితే ఈ ఎపిసోడ్లో బాబుగోగినేని, తనీష్, శ్యామల, దీప్తి సునైనా, తేజస్వినీ, అమిత్‌లు గణేశ్‌ను నామినేట్ చేశారు. దీనికి కారణంగా అతను హౌస్‌లో ఉండటానికి ఇబ్బంది పడుతున్నాడని, అతని బాధను చూడలేకపోతున్నామని, ఈ హౌస్‌లో ఈ చిన్నోడి వల్ల కావడం లేదనే కారణాలు తెలిపారు. నిజానికి గణేశ్ భయపడుతున్న విషయం వాస్తవమే.. కానీ అతనికి అవకాశం రావడం లేదన్నది కూడా ఇక్కడ గ్రహించాల్సిన విషయం. కిరిటీ తన గొంతు నొక్కే ప్రయత్నం చేశాడని, తనకేం తెలియదని,.. మాట్లాడుకు.. అని అడ్డుకున్నాడని గణేశే ఎలిమినేషన్ నామినేట్ చేసే సమయంలో చెప్పాడు. దీంతోనే అతను కెమెరాల ముందు వచ్చి ఎదో చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ల వ్యూహాలను గణేశ్ అర్థం చేసుకోలేకపోతున్నాడనేది వాస్తవం. సెలబ్రిటీలనే బెరకుతో అతను కొంత వెనక్కు తగ్గుతున్నాడు. ఈ విషయంలో గత ఎపిసోడ్‌లోనే నాని సైతం అతనికి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సింగర్ గీతామాధురి, కౌశల్ విషయంలో వ్యవహరించిన తీరుతో హౌస్‌లో విలన్‌గా మారిన కిరిటీ, గ్రూప్ మెయింటేన్ చేసిన తేజస్వి, ఆలోచించకుండా మాట్లాడే భాను శ్రీలు సైతం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. కెప్టెన్‌గా ఎంపికైన అమిత్, హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నందిని రాయ్‌లను బిగ్‌బాస్ ఈ ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి మినహాయించారు. ఈ ఎపిసోడ్లో కొన్ని ఫన్నీ గేమ్స్ జరగగా.. చివర్లో హీరోయిన్ నందిని రాయ్, భానుశ్రీలు గొడవపడ్డారు. టీ విషయంలో వాగ్వాదం చోటుచేసుకోగా.. పళ్లు రాలుతాయి, మూసుకో అంటూ తీవ్ర పదజాలంతో తిట్టుకున్నారు. ఈ గొడవకు ఎలిమినేషన్ ప్రక్రియనే కారణమని తెలుస్తోంది. ఫన్నీ బిరుదులు.. ఫన్నీ కామెంట్స్ కార్డ్స్‌ను ఎంపిక చేసుకోని వాటికి సరిపోయే హౌస్ మెట్స్‌ను ఎంపిక చేయమని బిగ్ బాస్ హౌస్‌మెట్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా అత్యంత నిర్భమైన వ్యక్తి భాను శ్రీ అని గీతామాధురి సూచించింది. ఆమె ఎవరికి భయపడదని, ఎదొస్తే అదే మాట్లాడుతుందని తెలిపింది. విచిత్రమైన వ్యక్తి తేజస్వీ అని, అప్పుడే కోప్పడి, అప్పుడే కలిసిపోతుందని దీంతో ఆమె వ్యక్తిత్వం అర్థం కావడం లేదని శ్యామల పేర్కొంది. మానిపపులేటర్, అపరిశుభ్రమైన వ్యక్తి రోల్‌రైడా అని దీప్తీ, సామ్రాట్లు సూచించారు. బిగ్‌బాస్ వదిలివేళ్లే వ్యక్తి గణేశ్ అని భాను శ్రీ సూచించగా.. అగ్లీగా ప్రవర్తించే వ్యక్తి కిరిటీ అని, అతను మాస్క్ వేసుకొని తిరుగుతారని దీప్తీ సునైనా పేర్కొంది. హౌస్‌లో అన్‌ఫెయిర్ దీప్తీ అని తేజస్వీ సూచించగా.. తనీష్, తేజస్వీ అసభ్యకరమైన వ్యక్తిగా పేర్కొన్నాడు. ఎక్కువ ప్రేమలో పడే వ్యక్తి తనీష్ అని కౌశల్, అతిపెద్ద తిండిబోతు తను, రోల్‌రైడా అని గణేశ్ ఒప్పుకున్నాడు. వెన్నుపోటు పొడిచే వ్యక్తి కౌశల్ అని కిరిటీ పేర్కొన్నాడు. హౌస్మెట్స్ మధ్య గొడవ పెట్టించే వ్యక్తి దీప్తి సునైనా అని బాబుగోగినేని తెలిపాడు. తేజస్వీ, సామ్రాట్ సమ్‌థింగ్ స్పెషల్.. ఈ ఎపిసోడ్లో తేజస్వీ, సామ్రాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి మధ్య స్నేహంకు మించి ఎదో ఉన్నట్లు అనుమానం కలిగేలా ప్రవర్తించారు. హౌస్‌మెట్స్‌కు దూరంగా గుసగులాడటం.. ఒకరి మీద ఒకరు పడటం, తినిపించుకోవడం చూస్తే ఓ ప్రేమ జంటలా ప్రవర్తించారు. అయితే ఇది గేమ్‌లో భాగంగానే ఇలా ప్రవర్తిస్తున్నారా? లేక సమ్‌థింగ్ స్పెషల్ ఏమైనా ఉందా? అని తెలియాలంటే.. మరన్నీ ఎపిసోడ్స్ జరగాల్సిందే. అయితే తేజస్వీ మాత్రం ఓ ప్రణాళికతో హౌస్‌లోకి వచ్చిందన్న విషయం అర్థం అవుతోంది. హౌస్‌లో ఓ సందర్భంలో గణేశ్‌తో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ గేమ్ గురించి తన అభిప్రాయాలను గణేశ్‌తో పంచుకుని అతని ఉత్సాహపరిచే ప్రయత్నం చేసింది. అయితే ఈ వ్యాఖ్యలతో ఆమె పక్కా తొలి రోజు నుంచి గేమ్ ప్లే చేస్తుందని, అంతా నటిస్తుందనే విషయం అర్థం అవుతోంది. -
సామాన్యులకు నో ఎంట్రీ
అనంతపురం అర్బన్: స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా అనంతపురంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు చూసేందుకు సామాన్యులకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రస్థాయి వేడుకలు.. ఊళ్లోనే జరుగుతున్నాయి..మళ్లీ జరుగుతాయో లేదో ఒక్కసారైనా ఆ వేడుక ప్రత్యక్షంగా చూడాలనుకున్న వారందరి ఆశలపై అధికారులు నీళ్లు పోశారు. వేడుకలను తిలకించేందుకు సాధారణ ప్రజలకు రెండు వేల కార్డులు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నా, వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రజల కోసం కేటాయించిన బీ–3 పాసులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చెంతకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో నాయకులంతా తమ అనుచరులకు, బంధువులకు పంచి పెట్టారు. దీంతో రాష్ట్రస్థాయి వేడుక కూడా అధికార పార్టీ కార్యక్రమంగా మారిపోయింది.