రోడ్డుప్రమాదంలో నవదంపతుల మృతి | Newly married couple die in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో నవదంపతుల మృతి

Jun 26 2016 1:58 PM | Updated on Aug 30 2018 4:07 PM

ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఓ జంట కలలు కల్లలయ్యాయి. చిలకా గోరింకల్లాంటి ఆ జంటను చూసి మృత్యువుకు కన్నుకుట్టిందేమో.. కారు రూపంలో వచ్చి వారి సంతోషాలను కబళించుకు వెళ్లింది.

పిఠాపురం (తూర్పు గోదావరి) : ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఓ జంట కలలు కల్లలయ్యాయి. చిలకా గోరింకల్లాంటి ఆ జంటను చూసి మృత్యువుకు కన్నుకుట్టిందేమో.. కారు రూపంలో వచ్చి వారి సంతోషాలను కబళించుకు వెళ్లింది. రెండు నెలల క్రితమే వివాహమైన జంట రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్‌రోడ్డులోని నేమామ్ గెస్ట్‌హౌస్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

కొత్తపల్లికి చెందిన నరేష్(27), భాగ్యం(21) రెండు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈక్రమంలో భార్య గర్భవతేమో తెలుసుకునేందుకు పరీక్షల నిమిత్తం బైక్‌పై ఆదివారం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement