హత్యకేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష | murder case.. life imprisonment | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

Oct 14 2016 1:37 AM | Updated on Sep 4 2017 5:05 PM

దేవరపల్లి : అత్త, భార్యను కత్తితో నరికి చంపిన కేసులో నిందితుడికి న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఎస్సై సీహెచ్‌ ఆంజనేయులు కథనం ప్రకారం.. 2013 జూన్‌ 22న దేవరపల్లిలో మానేపల్లి రవి తన భార్య పోశమ్మ, అత్త కల్లేపల్లి లక్ష్మిని కత్తితో నరికి చంపాడు.

దేవరపల్లి : అత్త, భార్యను కత్తితో నరికి చంపిన కేసులో నిందితుడికి న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఎస్సై సీహెచ్‌ ఆంజనేయులు కథనం ప్రకారం.. 2013 జూన్‌ 22న దేవరపల్లిలో మానేపల్లి రవి తన భార్య పోశమ్మ, అత్త కల్లేపల్లి లక్ష్మిని కత్తితో నరికి చంపాడు. దీనిపై అప్పటి ఎస్సై ఎంవీ సుభాష్‌ కేసు నమోదు చేశారు. సీఐ ఎం.బాలకృష్ణ దర్యాప్తు చేశారు. వాదనల అనంతరం గురువారం నిందితుడు రవికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ కొవ్వూరు తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి తీర్పుచెప్పారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా ఏడాదిపాటు కారాగార శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. అలాగే అత్త లక్ష్మిని చంపినందుకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement