చెరువులో పడి తల్లీపిల్లలు మృతి | Mother along with two children drown in pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి తల్లీపిల్లలు మృతి

Oct 10 2016 3:13 PM | Updated on Apr 4 2019 4:44 PM

ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ శివారులోని చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన తల్లి, ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతిచెందారు.

వెంకటాపురం (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ శివారులోని చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన తల్లి, ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతిచెందారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. సూరవీడు గ్రామానికి చెందిన కోమలి(35), తన ఇద్దరు పిల్లలు లహరి(15), శృతి(6)లను తీసుకుని బట్టలు ఉతికేందుకు సమీపంలోని చెరువుకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ కాలు జారి తల్లి చెరువులో పడడంతో ఏడుస్తూ పిల్లలు కూడా ఆమెను అనుసరించి చెరువులో పడి నీటిలో మునిగిపోయారు. తల్లీబిడ్డల మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement