ఇంటి దగ్గర దించుతామని... బాలికపై గ్యాంగ్ రేప్ | minor gang rape in nalgonda district | Sakshi
Sakshi News home page

ఇంటి దగ్గర దించుతామని... బాలికపై గ్యాంగ్ రేప్

Feb 23 2016 9:45 PM | Updated on Aug 29 2018 4:18 PM

ఇంటి దగ్గర దించుతామని...  బాలికపై గ్యాంగ్ రేప్ - Sakshi

ఇంటి దగ్గర దించుతామని... బాలికపై గ్యాంగ్ రేప్

చేసిందే దారుణమైన పని... అదేదో ఘనకార్యం అయినట్లు గొప్పలుచెప్పుకోవడంతో నీచమైన కార్యం వెలుగులోకి వచ్చింది.

నల్లగొండ : చేసిందే దారుణమైన పని... అదేదో ఘనకార్యం అయినట్లు గొప్పలుచెప్పుకోవడంతో నీచమైన కార్యం వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలురున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..... నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని కొండ్రపోల్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (17)  ఈనెల 12న మఠంపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి రాత్రి 8 గంటలకు ఈదులగూడకు చేరుకుంది.

ఆ సమయంలో ఇంటికి వెళ్లడానికి వాహనాలు ఏమి లేకపోవడంతో అక్కడే నిలుచుంది. ఆ విషయాని గమనించిన సదరు బాలిక పరిచయస్తులైన ముగ్గురు యువకులు ఇంటివద్ద దించుతాం అని నమ్మబలికి బైక్‌పై ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఏమి జరగలేదన్నట్లు బాలికను ఇంటి దగ్గర విడిచిపెట్టారు.

అయితే ఈ ఘటన గురించి నిందితులు తమ కళాశాలలో గొప్పలు చెప్పుకుంటుండంటంతో పసిగట్టిన ఓ యువకుడు బాలికను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు యువకులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement