కట్నం వేధింపులకు వివాహిత బలి | Married dowry harassment victim | Sakshi
Sakshi News home page

కట్నం వేధింపులకు వివాహిత బలి

Mar 29 2017 9:49 PM | Updated on Nov 6 2018 7:53 PM

కట్నం వేధింపులకు వివాహిత బలి - Sakshi

కట్నం వేధింపులకు వివాహిత బలి

మండలంలోని గంగినేపల్లిలో నాగమణి(24) అనే వివాహిత అదనపు కట్నం వేధింపులు తాళలేక బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ తెలిపారు. ఆయన కథనం ప్రకారం...

చెన్నేకొత్తపల్లి(రాప్తాడు): మండలంలోని గంగినేపల్లిలో నాగమణి(24) అనే వివాహిత అదనపు కట్నం వేధింపులు తాళలేక బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఆదెమ్మ, రాములప్ప దంపతుల కుమార్తె నాగమణి వివాహం బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి చెందిన దైవకుమార్‌తో రెండేళ్ల కిందట అయింది.  అదనపు కట్నం కోసం భర్త సహా అత్తమామల వేధింపులు అధికం కావడంతో మూడు నెలల కిందట ఆమె మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చింది. అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్ద ఉంటూ కొత్తచెరువులో టైలరింగ్‌ శిక్షణ పొందేది. రెండ్రోజుల కిందట భర్త అక్కడి వచ్చి బెదిరించడంతో మనస్తాపానికి గురైన నాగమణి మంగళవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం అస్పత్రిలోనే మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement