మార్కాపురం బస్టాండు వద్ద వ్యక్తి హత్య | Man murdered at Markapuram bus stand | Sakshi
Sakshi News home page

మార్కాపురం బస్టాండు వద్ద వ్యక్తి హత్య

Mar 15 2016 10:01 AM | Updated on Sep 3 2017 7:49 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండువద్ద మంగళవారం ఉదయం ఒక వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.

మార్కాపురం(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండువద్ద మంగళవారం ఉదయం ఒక వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో అతన్ని కిరాతకంగా నరికి హత్యచేశారు.

మార్కాపురం పట్టణానికి చెందిన చెన్నకేశవులు(43) ఉదయం బస్టాండు వద్ద నడుచుకుంటూ వెళుతుండగా వెంబడించిన దుండగులు దారుణంగా నరికి చంపారు. పాతకక్షల వల్లే ఈ హత్య జరిగిందని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement