
హైదారాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలాజీ ఫౌండేషన్ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.10 లక్షలు వెచ్చించి మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ... నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండులో తాగునీటి సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు.
బాలాజీ ఫౌండేషన్ వ్యాపారంతో పాటు సేవారంగంలోనూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. తన తండ్రి బాలాజీ చౌదరి నెల్లూరు నుంచే తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారని, అలాంటి ప్రాంతంలో బాలాజీ ఫౌండేషన్ సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని బీ న్యూ మొబైల్స్ అండ్ ఎల్రక్టానిక్స్’, బాలాజీ సంస్థ సీవోఈ సాయి నిఖిలేష్ తెలిపారు.