కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా కోసిగి, ఉరుకుంద రూట్లో వెళ్లాలంటేనే బస్సు డ్రైవర్లు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే శిథి లమైన రోడ్డు, అడుగులోతు గుంతలతో బస్సును నడపడమంటే తలప్రాణం తోకకు వస్తుందంటూ డ్రైవర్లు వాపోతున్నారు. గురువారం ఉరుకుంద బస్సులో 120 మందికి పైగా ప్రయాణికులు ఎక్క డంతో వారిని దింపేందుకు డ్రైవర్ బస్సును ఏకంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఈ ఘటన జరిగి రెండు రోజులు కూడా కాకుండానే, శని వారం మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఉదయం 9.30గంటలకు కోసిగికి వెళ్లే బస్సు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో వచ్చి ఆగిన వెంటనే 120 మందికి పైగా ప్రయాణికులు ఎగబడి ఎక్కారు. ఇంత మంది ఎక్కితే బస్సు ఎలా నడపాలని, అసలే బస్సుకు డోర్లేదని, శిథిలమైన రోడ్లలో ఏదైనా బస్సు ఎక్కేందుకు ఎగబడుతున్న జనం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని డ్రైవర్ ప్రాథేయ పడినా ఫలితం లేకపోయింది. దీంతో బస్సును నేరుగా పోలీసుస్టేషన్కు తీసుకెళ్లాడు.
‘రోజూ స్టేషన్ తీసుకొచ్చి ప్రయాణికులను కిందకు దింపమంటే ఎలా.. మీరే బస్టాండ్‌లో పరిమితంగా ఎక్కించుకోవాలి' అని పోలీసులు చెప్పడంతో ఎలాగైనా సమస్య పరిష్కరించాలని డ్రైవర్ వారిని కోరారు. చివరకు పోలీసులు ప్రయాణికులకు విషయం అర్థమయ్యేలా చెప్పి కొందరిని కిందకు దించారు. వారంతా శాపనార్థాలు పెడుతూ తిరిగి బస్టాండ్‌కు వెళ్లిపోవడంతో బస్సు కోసిగి వైపునకు కదిలింది.


