భార్యని చంపి సముద్రతీరంలో పూడ్చి పెట్టాడు | Man killed his wife in kakinada | Sakshi
Sakshi News home page

భార్యని చంపి సముద్రతీరంలో పూడ్చి పెట్టాడు

Jan 21 2016 11:04 AM | Updated on Sep 3 2017 4:03 PM

భార్యని చంపి సముద్రతీరంలో పూడ్చి పెట్టాడు

భార్యని చంపి సముద్రతీరంలో పూడ్చి పెట్టాడు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది.

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాతతో భార్యను భర్త తాతారావు హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని కాకినాడ సముద్రతీరంలో పూడ్చి పెట్టాడు. అయితే తమ కుమార్తె ఆచూకీ తెలియడం లేదని మృతిరాలి బంధువులు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో తాతారావును పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను తానే హత్య చేసినట్లు తాతారావు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement