విద్యుదాఘాతంతో వ్యక్తికి గాయాలు | man injured of vidyut lines | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తికి గాయాలు

Apr 14 2017 12:10 AM | Updated on Oct 8 2018 3:08 PM

హిందూపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న అశ్వత్థప్ప(40) గురువారం విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.

హిందూపురం అర్బన్‌ : హిందూపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న అశ్వత్థప్ప(40) గురువారం విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. మిద్దెపై నుంచి 220 కేవీ విద్యుత్‌ లైన్‌ వెళ్లింది. ఇది గమనించకుండా అశ్వత్థ ఇంటిపై నీళ్లు పోయడానికి వెళ్లడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడన్నారు. ముఖం, శరీరం తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే స్థానికులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement