విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | man died by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

May 15 2017 11:20 PM | Updated on Sep 5 2018 2:26 PM

గంజిహళ్లి గ్రామంలో విద్యుదాఘాతంతో పింజరి తిక్కయ్య (47) మృతి చెందాడు.

గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామంలో విద్యుదాఘాతంతో పింజరి తిక్కయ్య (47) మృతి చెందాడు. సోమవారం రాత్రి వర్షం కురవడంతో సోమవారం ఉదయం గ్రామంలోని ఎస్వీ నగర్‌లో తన ఇంటి మిద్దె ఎక్కి చూస్తుండగా ఇంటిపైనే వేలాడుతున్న విద్యుత్‌ లైన్‌ తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతుడికి భార్య బీబీ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.  గ్రామంలో కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలను సరి చేయాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement