జాడలేని వర్షాలు.. మండిపోతున్న ఎండలు..! | No Rains in Telangana | Sakshi
Sakshi News home page

జాడలేని వర్షాలు.. మండిపోతున్న ఎండలు..!

Jul 12 2026 7:28 AM | Updated on Jul 12 2026 7:31 AM

No Rains in Telangana

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా జూలై నెలలో కనువిందు చేయాల్సిన రుతుపవన వర్షాలు కనుమరుగయ్యాయి. మహా నగరంలో రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం నుంచి చినుకులు కురుస్తాయనుకుంటే.. దానికి భిన్నంగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. గడచిన రెండు రోజుల్లో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం కనిపిస్తోంది. 

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజా నివేదికల ప్రకారం.. రాబోయే మరో మూడు రోజుల పాటు నగరంలో పొడి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. అక్కడక్కడా స్థానిక ఉష్ణోగ్రతల ప్రభావంతో  తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ, భారీ వర్ష సూచనలు మాత్రం ప్రస్తుతానికి లేవని అధికారులు స్పష్టం చేశారు. నగరంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇప్పటికే దాదాపు 28 శాతం లోటు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement