హరితహారం పెద్ద స్కామ్: భట్టి | Mallu Bhatti Vikramarka comments on Haritaharam as a Scam | Sakshi
Sakshi News home page

హరితహారం పెద్ద స్కామ్: భట్టి

Jul 8 2016 3:15 AM | Updated on Mar 18 2019 7:55 PM

హరితహారం పెద్ద స్కామ్: భట్టి - Sakshi

హరితహారం పెద్ద స్కామ్: భట్టి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారాన్ని ఓ పెద్ద స్కామ్‌గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.

సాక్షి ప్రతినిధి,నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారాన్ని ఓ పెద్ద స్కామ్‌గా కాం గ్రెస్ పార్టీ అభివర్ణించింది. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ఎంతవుతుందని లెక్కకడితే రూ.1000 కోట్లు తేలిందని, కానీ, నాటిన వాటిలో ఎన్ని మొక్కలు బతుకుతున్నాయో లెక్క తేలడంలేదని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం నల్లగొండలో జరిగిన పార్టీ అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ... మొక్కలు నాటే కార్యక్రమంలో కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న స్కాములన్నీ స్కీములేనని, దేశంలో ఇన్ని స్కాములు జరిగిన రాష్ట్రం ఎక్కడా లేదన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement