పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట | Love couple in Police station | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

Apr 7 2016 12:34 AM | Updated on Aug 21 2018 9:20 PM

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట - Sakshi

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

తమకు రక్షణకావాలంటూ ఓ ప్రేమజంట స్థానిక డీఎస్పీ జె.వెంకటరావును ఆశ్రయించారు.

 జంగారెడ్డిగూడెం: తమకు రక్షణకావాలంటూ ఓ ప్రేమజంట స్థానిక డీఎస్పీ జె.వెంకటరావును ఆశ్రయించారు. కొవ్వూరుకు చెందిన తాపీమేస్త్రి జి.ఏసురాజు, డిగ్రీ పూర్తిచేసిన పి.లలిత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లలిత నివశించే మూడు డాబాల వీధిలో ఏసురాజు కొంత కాలం తాపీపనిచేశారు.
 
 ఆ సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈక్రమంలో వారు వివాహానికి సిద్దపడగా, పెద్దలు తెలుసుకుని కొంతకాలం ఆగితే తామే చేస్తామని ఒప్పించారు. ఇటీవల లలితను అశ్వారావుపేటలోని తన మామయ్య ఇంట్లో దాచి ఉంచారు. అయితే బుధవారం ఏసు రాజు, లలిత జంగారెడ్డిగూడెం వచ్చి పారిజాతగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు.
 
 అనంతరం తమ పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ డీఎస్పీ జె.వెంకటరావును ఆశ్రయించారు. దీంతో ఆయన వారికి ఒక కానిస్టేబుల్, ఒక మహిళా కానిస్టేబుల్‌ను రక్షణగా ఇచ్చి కొవ్వూరు డీఎస్పీ వద్దకు పంపారు. ఇద్దరు మేజర్లు కావడంతో కొవ్వూరు డీఎస్పీ వారి తల్లితండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారని వెంకటరావు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement