లారీ ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం | Larry hit ..skutaristu killed | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం

Dec 8 2016 10:28 PM | Updated on Aug 30 2018 4:07 PM

లారీ ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం - Sakshi

లారీ ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం

తాడిపత్రి-అనంతపురం మార్గంలోని పట్టణ సరిహద్దులో గల రైల్వే గేటు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుట్లూరు మండలం కందుగోపుల గ్రామానికి చెందిన నాగేంద్ర(21) మరణించాడని పోలీసులు తెలిపారు.

తాడిపత్రి రూరల్‌: తాడిపత్రి-అనంతపురం మార్గంలోని పట్టణ సరిహద్దులో గల రైల్వే గేటు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుట్లూరు మండలం కందుగోపుల గ్రామానికి చెందిన నాగేంద్ర(21) మరణించాడని పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎర్రనాగప్ప, సాయమ్మ దంపతుల మూడో కుమారుడైన నాగేంద్ర తాడిపత్రి మండలం సజ్జలదిన్నె నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో తాడిపత్రిలోని రైల్వే గేటు సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకోనడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడన్నారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం పెద్దాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. బైక్‌ కూడా లారీ చక్రాల కింద పడి నుజ్జునుజ్జు అయింది. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు. కాగా నాగేంద్ర సోదరులిద్దరి వివాహం 20 రోజుల కిందటే కాగా, కుటుంబ సభ్యులందరూ ఇంకా పెళ్లి ముచ్చట్లలోనే ఉన్నారు. అంతలోనే ప్రమాదంలో మూడో కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement