‘రాష్ట్రంలో కరువు...హెరిటేజ్‌కు పండగ’

‘రాష్ట్రంలో కరువు...హెరిటేజ్‌కు పండగ’ - Sakshi


విజయవాడ: రాష్ట్రంలో కరువు పరిస్థితులతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం చంద్రబాబునాయుడు మాత్రం దానిని తన హెరిటేజ్ కంపెనీకి పండగలా మర్చుకొని భారీగా సొమ్ము చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ ధ్వజమెత్తారు. కరువును సైతం కాసులుగా మార్చుకోవడం చంద్రబాబు, లోకేష్, మంత్రులకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజానీకం కరువుతో అల్లాడుతుంటే విహారయాత్రలకు సీఎం బయలుదేరడం వెనుక ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు. కరువు వస్తే రాబందులకు, గద్దలకు పండగ అయితే.. రాష్ట్రంలో కరువు చంద్రబాబు, లోకేష్, హెరిటేజ్ కంపెనీలకు పండగగా మారిందన్నారు.కరువును సైతం నిస్సిగ్గుగా కాసులుగా మార్చుకుంటున్న చంద్రబాబు, లోకేష్‌ల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. మండుటెండల్లో తాగునీటిని, మజ్జిగను అందిస్తామంటే ప్రజలపై ప్రేమతో ఇస్తారని అనుకున్నామని హెరిటేజ్‌పై అభిమానంతోనేనని ఇప్పుడు అర్థం అవుతోందన్నారు. మజ్జిగ కోసం జిల్లాకు మూడు కోట్లు చొప్పున 39 కోట్లును కేటాయించారని ఇదంతా హెరిటేజ్ కోసమే తప్ప ప్రజల కోసం కాదని అన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ హెరిటేజ్ పెరుగును కొనుగోలు చేయాలంటూ జారీ చేసిన లెటర్లు ప్రజలందర్నీ అలోచింపజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.ప్రత్యేక హోదాపై నిర్లక్ష్యం

రెండేళ్లుగా ప్రత్యేక హోదా వస్తుందని.. పరిశ్రమలు వస్తాయని ఎంబీఏ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన యువత ఆశగా ఎదురు చూస్తుంటే కేంద్రమంత్రులు ప్రత్యేక హోదా ఇవ్వబోమని, కనీసం ప్యాకేజీ కానీ, రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు కూడా ఏమీ ఇవ్వబోమంటూ పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజానీకాన్ని బాధించిందన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు ఢిల్లీలో ప్రత్యేక హోదాపై నోరువిప్పకుండా ఇక్కడకు వచ్చి ప్రెస్‌మీట్‌లు పెట్టడం ప్రజలను వంచించడమేనన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతత్వంలో వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లను ముట్టడి ంచి ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని కేంద్రం దష్టికి తీసుకువెళతామన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top