శాంతియుత నిరసనలపై ప్రభుత్వ ఉక్కుపాదం | iron leg on peace protest | Sakshi
Sakshi News home page

శాంతియుత నిరసనలపై ప్రభుత్వ ఉక్కుపాదం

Sep 9 2016 11:40 PM | Updated on Sep 4 2017 12:49 PM

శాంతియుత నిరసనలపై ప్రభుత్వ ఉక్కుపాదం

శాంతియుత నిరసనలపై ప్రభుత్వ ఉక్కుపాదం

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ పిలుపునిచ్చిన బంద్‌ను విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్రపన్నింది.

– కలెక్టరేట్‌ నుంచి గాంధీ విగ్రహం వరకు నిషేధాజ్ఞలు విధింపు
– ఊరేగింపులు, ధర్నాలు, నిరసన ప్రదర్శలు నిర్వహించరాదని హెచ్చరికలు
– ఆదేశాలిచ్చిన కలెక్టర్‌ విజయమోహన్‌
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ పిలుపునిచ్చిన బంద్‌ను విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్రపన్నింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో విఫలం కావడాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి చేపడుతున్న బంద్‌ను విచ్చిన్నం చేసే దిశగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు నిషేధాజ్ఞలు విధించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి నిరసన ప్రదర్శలు, ధర్నాలు, ఊరేగింపుల వంటివి నిర్వహించరాదని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు మూడు చోట్ల ఫ్లెక్సీ, బ్యానర్లను ఏర్పాటు చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతియుతంగా జరిపే ఆందోళలను అణచివేసే విధంగా నిషేధాజ్ఞలు విధించడాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement