'నమ్మి ఇస్తే ఇంత మోసం చేస్తారా' | hicourt serious on ap sarkar | Sakshi
Sakshi News home page

'నమ్మి ఇస్తే ఇంత మోసం చేస్తారా'

Nov 19 2015 9:21 PM | Updated on Aug 18 2018 8:05 PM

'నమ్మి ఇస్తే ఇంత మోసం చేస్తారా' - Sakshi

'నమ్మి ఇస్తే ఇంత మోసం చేస్తారా'

రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నమ్మి భూములు ఇస్తే తమకు నష్టపరిహారం కూడా సరిగా చెల్లించడం లేదని ఏపీ రైతులు హైకోర్టు మెట్లెక్కారు.

హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నమ్మి భూములు ఇస్తే తమకు నష్టపరిహారం కూడా సరిగా చెల్లించడం లేదని ఏపీ రైతులు హైకోర్టు మెట్లెక్కారు. దాదాపు 54 మంది రైతులు ఏపీ ప్రభుత్వ చేష్టలతో ఆవేదన చెంది హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో హైకోర్టు కూడా ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నమ్మి తమ భూములను ఇస్తే రైతులను మోసం చేస్తారా అంటూ ప్రశ్నించింది. ఈ విషయంపై రెండు వారాల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement