నాగార్జున ఫ్యాన్స్ ఆందోళన: ఇద్దరి ఆత్మహత్యాయత్నం | Hero nagarjuna fans protests at cinema theatre in kurnool | Sakshi
Sakshi News home page

నాగార్జున ఫ్యాన్స్ ఆందోళన: ఇద్దరి ఆత్మహత్యాయత్నం

Nov 10 2015 2:04 PM | Updated on Jul 15 2019 9:21 PM

నాగార్జున ఫ్యాన్స్ ఆందోళన: ఇద్దరి ఆత్మహత్యాయత్నం - Sakshi

నాగార్జున ఫ్యాన్స్ ఆందోళన: ఇద్దరి ఆత్మహత్యాయత్నం

నగరంలో ఆనం థియేటర్ వద్ద నాగార్జున ఫ్యాన్స్ మంగళవారం ఆందోళనకు దిగారు.

కర్నూలు : నగరంలో ఆనం థియేటర్ వద్ద నాగార్జున ఫ్యాన్స్ మంగళవారం ఆందోళనకు దిగారు. అఖిల్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నారని వారు సినిమా హాల్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఇద్దరు అభిమానులు మాత్రం తమ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. అంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిద్దరిని పోలీస్ స్టేషన్కి తరలించారు. టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేని తనయుడు అఖిల్ అక్కినేని అఖిల్ సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం బుధవారం విడుదల కానుంది. ఆ క్రమంలో సినిమా థియేటర్లు టికెట్లు అడ్వాన్స్ గా  విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement