తిరుమలకు పోటెత్తిన భక్తులు | heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలకు పోటెత్తిన భక్తులు

Mar 26 2016 6:39 AM | Updated on Sep 3 2017 8:38 PM

వరుస సెలవు దినాలు రావడంతో తిరుమల భక్తులతో పోటెత్తింది.

తిరుమల: వరుస సెలవు దినాలు రావడంతో తిరుమల భక్తులతో పోటెత్తింది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి... కిలోమీటరు మేర బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. భక్తులు రద్దీ అధికంగా ఉండటంతో గదులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తలనీలాలు  సమర్పించేందుకు కూడా భక్తులు బారులు తీరారు. 

Advertisement
 
Advertisement
Advertisement