రోడ్డుప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి | Head Constable dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి

Sep 30 2016 5:10 PM | Updated on Aug 30 2018 4:10 PM

మెదక్ జిల్లా సిద్దిపేట్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామచంద్రారెడ్డి(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

సిద్దిపేట్ (మెదక్) : మెదక్ జిల్లా సిద్దిపేట్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామచంద్రారెడ్డి(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం 4.20 గంటల సమయంలో సిద్దిపేట్ శివారులోని రాజీవ్ రహదారిపై బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని డీసీఎం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.

సిద్దిపేట్ డీఎస్పీ కార్యాలయంలో రైటర్‌గా పనిచేసిన ఆయన ఇటీవలే రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్బీ విభాగంలో జాయినయ్యారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ షేక్ లాల్ అహ్మద్ సహా పలువురు అధికారులు సంఘటనస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు ప్రారంభించారు. రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement