సమస్యలు పరిష్కరించాలని జీపీ కార్మికుల ధర్నా | grama panchayat workers protest | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని జీపీ కార్మికుల ధర్నా

Sep 16 2016 5:52 PM | Updated on Sep 4 2017 1:45 PM

సమస్యలు పరిష్కరించాలని జీపీ కార్మికుల ధర్నా

సమస్యలు పరిష్కరించాలని జీపీ కార్మికుల ధర్నా

సూర్యాపేటరూరల్‌ : గ్రామపంచాయతీ ఉద్యోగ, వర్కర్ల సమస్యలను పరిష్కరించే దిశగా జీఓ నం.63ను సవరణ చేయాలని సీఐటీయూ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కొలిశెట్టి యాదగిరిరావు, వెంపటి గురూజీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సూర్యాపేటరూరల్‌ : గ్రామపంచాయతీ ఉద్యోగ, వర్కర్ల సమస్యలను పరిష్కరించే దిశగా జీఓ నం.63ను సవరణ చేయాలని సీఐటీయూ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కొలిశెట్టి యాదగిరిరావు, వెంపటి గురూజీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  44 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యల పరిష్కారం కోసం రాతపూర్వక హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు గుమ్మడవెల్లి వెంకటేశం, ఆదిమల్ల సైదులు, చెర్కుపల్లి రాజు, మేకల రవి, బట్టు సుజాత, ఆదిమల్లు నాగయ్య, మోదుగు శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement