తాళం వేసి ఉన్న ఇంట్లో బంగారం, వెండి చోరీ | gold and silver theft in house | Sakshi
Sakshi News home page

తాళం వేసి ఉన్న ఇంట్లో బంగారం, వెండి చోరీ

Jul 19 2016 10:18 PM | Updated on Sep 4 2017 5:19 AM

ఖానాపూర్‌లోని తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో బంగారం, వెండి ఆభరణాల చోరీ జరిగింది. ప్రొబేషనరీ ఎస్సై కె.రమేశ్‌ కథన ం ప్రకారం... మండల కేంద్రంలోని విద్యానగర్‌లో గల ఎల్‌ఐసీ ఏజెంట్‌ మైలారపు లక్ష్మణ్‌ ఇంట్లోని ఓ పోర్షన్‌లో వొల్లాల అనిల్‌కుమార్‌ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు.

ఖానాపూర్‌ : ఖానాపూర్‌లోని తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో బంగారం, వెండి ఆభరణాల చోరీ జరిగింది. ప్రొబేషనరీ ఎస్సై కె.రమేశ్‌ కథన ం ప్రకారం... మండల కేంద్రంలోని విద్యానగర్‌లో గల ఎల్‌ఐసీ ఏజెంట్‌ మైలారపు లక్ష్మణ్‌ ఇంట్లోని ఓ పోర్షన్‌లో వొల్లాల అనిల్‌కుమార్‌ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు. అనిల్‌కుమార్‌ కుటుంబంతో సహా కొద్ది రోజుల క్రితం ఇంటికి తాళం వేసి తమ స్వస్థలానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకోగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 10 గ్రాములతో కూడిన రెండు బంగారు చైన్‌లతో పాటు చిన్నపిల్లకు చెందిన 7 గ్రాముల రింగ్స్, ఇతర వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. వీటి విలువ రూ.80 వేలు ఉంటుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement