పీజీ తెలుగు ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ | free coaching for pg telugu entrance | Sakshi
Sakshi News home page

పీజీ తెలుగు ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ

Apr 25 2017 11:00 PM | Updated on Sep 5 2017 9:40 AM

రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఎంఏ తెలుగుపై ఆసక్తి ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ప్రవేశ పరీక్షపై ఉచితంగా శిక్షణ ఇస్తామని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌ డా.ఎన్‌ రంగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు సిటీ: రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఎంఏ తెలుగుపై ఆసక్తి ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ప్రవేశ పరీక్షపై ఉచితంగా శిక్షణ ఇస్తామని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌ డా.ఎన్‌ రంగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల28వ తేదీ నుంచి తెలుగు అధ్యాపకులు కె.రామలింగారెడ్డి, డా.ఎన్‌.బి లోకరాజు శిక్షణ ఇస్తారన్నారు. స్థానిక డాక్టర్స్‌ కాలనీ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో తరగతులుంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్‌చే  ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఈనెల 27వ తేదీలోగా కాలేజీలో అందజేయాలని సూచించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement