వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి | four killed in diffrent accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

Sep 6 2016 11:58 PM | Updated on Apr 3 2019 7:53 PM

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి - Sakshi

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు వాహనాలు ఢీకొని మృతి చెందగా ఒకరు ఓవర్‌టెక్‌ చేయబోయి వాహనం తగిలి దుర్మమరణం చెందారు.

 
జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు వాహనాలు ఢీకొని మృతి చెందగా  ఒకరు ఓవర్‌టెక్‌ చేయబోయి వాహనం తగిలి దుర్మమరణం చెందారు.
 
గన్నవరం :
 ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కేసరపల్లి శివారు వెంకటనరసింహాపురం కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... కాలనీలోని మూడో రోడ్డులో ఉంటున్న పులి ప్రభాకర్‌(60) రాడ్‌ బెండింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మణమ్మతో కలిసి పొలం వెళ్తుండగా ముస్తాబాద వైపుగా వెళ్తున్న బైక్‌ ప్రభాకర్‌ను ఢీకొట్టింది. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాహనాన్ని తప్పించబోయి విద్యార్థి..
నూజివీడు : పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు.. ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన మత్తే డేవిడ్‌రాజు బంగినపల్లితోట ప్రాంతంలో ఉన్న కల్వరి హాస్టల్‌లో ఉంటూ ధర్మఅప్పారావు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. డేవిడ్‌రాజు, స్నేహితుడు సూదం సాగర్‌తో బైక్‌పై వెళ్తూ ట్రాలీని ఓవర్‌టేక్‌ చేస్తుండగా ఎదురుగా మరో ద్విచక్రవాహనం రావడంతో బండికి బ్రేక్‌ వేశాడు. ఇదే సమయంలో ట్రాలీని కుడివైపునకు మళ్లించడంతో డేవిడ్‌రాజు నడుపుతున్న బైక్‌ను ట్రాలీపట్టి లాక్కెళ్లింది.108లో ఆస్పత్రికి తరలించారు. విజయవాడలో చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందాడు.  ఇన్‌చార్జి ఎస్‌ఐ చిన్ని నాగప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ప్రిన్సిపాల్‌ జీవీ రామారావుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులురెండు నిమషాలు మౌనం పాటించారు.
మినీ వ్యాన్‌ ఢీకొని వృద్ధుడి..
íÜంగన్నగూడెం (ఆగిరిపల్లి):  మినీ వ్యాన్‌ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన  సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వి.రాజేంద్రప్రసాద్‌ కథనం మేరకు గ్రామానికి చెందిన చిన్ని చంద్రయ్య (50) విజయవాడ రోడ్డులోని సాయిబాబా ఆలయం సమీపంలో గేదెలను మేపుతున్నాడు. విజయవాడ వెళ్తున్న మినీవ్యాన్‌ చంద్రయ్యను సోమవారం మధ్యాహ్నం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108లో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. 
ఆర్టీసీ బస్సు ఢీకొని..
నందిగామ రూరల్‌  : పట్టణ శివారుల్లోని అనాసాగరం గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ఓర్సు ప్రసాద్‌ (45) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి సమయంలో విధుల్లో చేరేందుకు అనాసాగరం వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా, హైదరాబాద్‌ నుంచి అమలాపురం వెళ్తున్న ఏపీఎస్‌ ఆర్టీసీ ఇంద్ర బస్సు ఢీకొట్టింది. ప్రసాద్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తులసి రామకృష్ణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement