ఇటీవల కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది.
శ్రీశైలం డ్యామ్‌కు వరద నీరు
Sep 18 2016 10:04 PM | Updated on Sep 27 2018 5:46 PM
873. 70 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు: ఇటీవల కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం సమయానికి ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల, రోజాల నుంచి 29,437 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనివ్వా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయ పరిసర ప్రాంతాలలో 9.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రానికి డ్యామ్‌లో నీటి మట్టం 873.70 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 157.5068 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Advertisement


