శ్రీశైలం డ్యామ్‌కు ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి 32వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. విద్యుత్ డిమాండ్‌ను అనుసరించి తెలంగాణా, ఆంధ్రప్రాంతంలోని జల విద్యుత్ కేంద్రాలు ఉత్పాదన చేస్తున్నాయి.
శ్రీశైలం డ్యామ్‌కు వరద నీరు
Aug 3 2016 12:22 AM | Updated on Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు:
శ్రీశైలం డ్యామ్‌కు ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి 32వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. విద్యుత్ డిమాండ్‌ను అనుసరించి తెలంగాణా, ఆంధ్రప్రాంతంలోని జల విద్యుత్ కేంద్రాలు ఉత్పాదన చేస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు జనరేటర్లు విద్యుత్ ఉత్పత్తి చేశాయి. భూగర్భజలవిద్యుత్ కేంద్రంలో ఒక జనరేటర్ 150 మెగావాట్ల సామర్థ్యంలో ఉత్పాదన చేస్తున్నాయి. సగటున 15 వేల క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో 45.6830 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.
Advertisement


