విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేత | Flattering Documents Distribution | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేత

Sep 2 2016 11:58 PM | Updated on Sep 4 2017 12:01 PM

విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేత

విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేత

: కోదాడ పట్టణానికి చెందిన రిషి డ్యాన్స్‌ అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు గత నెల 29న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పలు విభాగాల్లో నృత్యాలను ప్రదర్శించారు.

కోదాడఅర్బన్‌: కోదాడ పట్టణానికి చెందిన రిషి డ్యాన్స్‌ అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు గత నెల 29న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పలు విభాగాల్లో నృత్యాలను ప్రదర్శించారు. రిషి డ్యాన్స్‌ అకాడమీ డైరక్టర్‌ నాగేశ్వరరావును ప్రభుత్వం కళాసరస్వతి బిరుదుతో సన్మానించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలొ వారు నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు అందజేసిన ప్రశంసాపత్రాలను శుక్రవారం కోదాడ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వంటిపులి అనిత అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు నృత్యరంగంలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమలో వైస్‌ చైర్మన్‌ తెప్పని శ్రీనివాస్, నాయకులు కంభంపాటి శ్రీను, వేలాద్రి, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement