పిజ్జాలు, బర్గర్లు, గోల్‌గప్పా..  | Food deliveries poured into the Jantar Mantar protest site from across India | Sakshi
Sakshi News home page

పిజ్జాలు, బర్గర్లు, గోల్‌గప్పా.. 

Jul 23 2026 5:02 AM | Updated on Jul 23 2026 6:35 AM

Food deliveries poured into the Jantar Mantar protest site from across India

కొద్దిరోజుల నుంచి అలుపెరగక ఉద్యమంలో కొనసాగి అలసిపోయిన ఉద్యమకారులకు ఢిల్లీ, పొరుగున ఉన్న ప్రాంతాల్లోని సానుభూతిపరుల నుంచి ఆహార సహాయం వెల్లువెత్తుతోంది. తమ శక్తిమేరకు జనం ఈ విద్యార్థులకు సీజనల్‌ పండ్లు, ఇతర ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరి కొందరు వినూత్నంగా పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, గోల్‌గప్పాలు సైతం పంపిణీచేస్తున్నారు. పంక్తి భోజనాలకూ కొందరు ఆర్థికసాయం చేస్తున్నారు.

 కొందరు సాయంకాలపు చిరుతిండ్లు పంపిస్తూ ఉద్యమకారుల ఆకలిబాధలను తీరుస్తున్నారు. చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, పండ్ల రసాలు, శీతలపానీయాలు, దహీబల్లా ఇలా ఎన్నో రకాల ఆహారపదార్థాలను ఉచితంగా పంపిణీచేస్తున్నారు. ఆహార పొట్లాల పంపిణీ ఊపందుకుంద. సామూహిక భోజనాలకు సిక్కు వర్గీయులు ముందుకొచ్చారు. వాటర్‌ బాటిళ్లను విపరీతంగా పంచుతున్నారు. ఒక మలీ్టనేషనల్‌ కంపెనీలో పనిచేసే ఉన్నతోద్యోగి రవి మౌర్య కొద్దిరోజులు ఆఫీస్‌కు సెలవు పెట్టిమరీ ఉద్యమకారులకు ఆహార ఏర్పాట్లలో సాయపడుతున్నారు.

 ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లనూ అందుబాటులో ఉంచుతున్నారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌ల నుంచి బుధవారం ఉదయమే ఇక్కడికి చేరుకున్నట్లు కొందరు నిరసనకారులు తెలిపారు. సమగ్రమైన విద్యావ్యవస్థ కోసం పోరాడుతున్న విద్యార్థులకు వృద్ధుల మద్దతూ ఉందని చాటేందుకే ఇక్కడికి వచ్చానని పంజాబ్‌ నుంచి వచ్చిన 70 ఏళ్ల బలదేవ్‌ తెలిపారు. ఇంట్లోంచి చూడ్డంకంటే నేరుగా ఉద్యమాన్ని కళ్లారా చూడ్డానికి వచ్చానని స్కూల్‌ యూనిఫాంలో వచ్చిన 16 ఏళ్ల విద్యార్థి ఒకరు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement