మినీ ఫిషింగ్‌ హార్బర్‌ డిజైన్‌ విడుదల | fishing horber desine release | Sakshi
Sakshi News home page

మినీ ఫిషింగ్‌ హార్బర్‌ డిజైన్‌ విడుదల

Sep 15 2016 10:46 PM | Updated on May 24 2018 2:36 PM

అంతర్వేది కేంద్రంగా రూ.23 కోట్లతో నిర్మించబోయే మినీ ఫిషింగ్‌ హార్బర్‌ డిజైన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా గురువారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డిజైన్‌ను విలేకరులకు చూపించారు. మినీ ఫిషింగ్‌ హార్భర్‌ నిర్మాణం దశాబ్ధకాలంగా మరుగున పడిందన్నారు.

రాజోలు : 

అంతర్వేది కేంద్రంగా రూ.23 కోట్లతో నిర్మించబోయే మినీ ఫిషింగ్‌ హార్బర్‌ డిజైన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా గురువారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డిజైన్‌ను విలేకరులకు చూపించారు. మినీ ఫిషింగ్‌ హార్భర్‌ నిర్మాణం దశాబ్ధకాలంగా మరుగున పడిందన్నారు. ఒక దశలో హార్భర్‌ కోసం విడుదల చేసిన నిధులు మళ్లింపునకు గురైతే ఆ సమయంలో ఉద్యమాలు చేపట్టామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో అంతర్వేది కేంద్రంగా రూ.1800 కోట్లతో డ్రెజ్జింగ్‌ హార్భర్, రూ.23 కోట్లతో మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం జగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నిర్మాణాలతో జిల్లా సముద్ర రవాణా, ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement