అనంతపురంలో కాల్పుల కలకలం | firing in ananthapuram | Sakshi
Sakshi News home page

అనంతపురంలో కాల్పుల కలకలం

Sep 16 2015 7:28 AM | Updated on Oct 2 2018 2:30 PM

అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలం సీతారామపురం వద్ద కాల్పుల కలకలం రేగింది.

అనంతపురం:జిల్లాలోని ధర్మవరం మండలం సీతారామపురం వద్ద కాల్పుల కలకలం రేగింది.  బుధవారం తెల్లవారుజామున ఎన్ హెచ్ 44పై కారులో వచ్చిన ఓ వ్యక్తి ఓ లారీడ్రైవర్పై కాల్పులు జరిపాడు. కర్ణాటక రాష్ట్రం బిజాపూర్‌కు చెందిన లారీ బెంగుళూరు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. లారీ పక్క నుంచి ఇండికా కారులో వచ్చిన దుండగులు కారులో నుంచే డ్రైవర్‌పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. లారీ డ్రైవర్ సురేష్ డొక్కలో ఆరు బుల్లెట్లు దూసుకుపోయాయి. బుల్లెట్ల దెబ్బకు సురేష్ పక్కకు ఒరిగిపోవడంతో క్లీనర్ లారీని సమయస్ఫూరితో ఆపేశాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రుని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు కారణాలు తెలియరాలేదు. ధర్మవరం డిఎస్పీ వేణుగోపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement