పేపర్ మిల్లులో అగ్నిప్రమాదం: రూ.4 కోట్ల ఆస్తి నష్టం | Fire accident in Paper mill | Sakshi
Sakshi News home page

పేపర్ మిల్లులో అగ్నిప్రమాదం: రూ.4 కోట్ల ఆస్తి నష్టం

Apr 9 2016 4:40 PM | Updated on Sep 5 2018 9:45 PM

నిజామాబాద్ మండలం కాలూరులోని పేపర్ మిల్లులో శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో రూ.4 కోట్ల రూపాయల విలువైన రా మెటీరియల్ దగ్ధమైంది.

నిజామాబాద్ : నిజామాబాద్ మండలం కాలూరులోని పేపర్ మిల్లులో శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో రూ.4 కోట్ల రూపాయల విలువైన రా మెటీరియల్ దగ్ధమైంది. 200 లారీల పేపర్ వేస్ట్ దగ్ధమైంది. నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పుతున్నాయి. అయినా మంటలు అదుపులోకి రాలేదు. మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడంలేదని యాజమాన్యం ప్రతినిధులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement