breaking news
kaluru
-
నారాయణ కాలేజిలో ఫుడ్ పాయిజన్
తిరుపతి: కాలూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న నారాయణ జూనియర్ కాలేజీలో హాస్టల్లో విషాహారం తీసుకుని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి హాస్టల్లో పులిసిన పెరుగన్నం పెట్టడంతో అది తిన్న 30 మంది విద్యార్థులకు తెల్లవారుజామునుంచి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ప్రారంభమయ్యాయి. దీంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. 20 మంది విద్యార్థులను తిరిగి కళాశాలకు తీసుకెళ్లగా మరో పది మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఇలా నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
పేపర్ మిల్లులో అగ్నిప్రమాదం: రూ.4 కోట్ల ఆస్తి నష్టం
నిజామాబాద్ : నిజామాబాద్ మండలం కాలూరులోని పేపర్ మిల్లులో శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో రూ.4 కోట్ల రూపాయల విలువైన రా మెటీరియల్ దగ్ధమైంది. 200 లారీల పేపర్ వేస్ట్ దగ్ధమైంది. నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పుతున్నాయి. అయినా మంటలు అదుపులోకి రాలేదు. మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడంలేదని యాజమాన్యం ప్రతినిధులు పేర్కొన్నారు.