నారాయణ కాలేజిలో ఫుడ్‌ పాయిజన్‌ | food poisoned in narayana college, 9 students hospitalized | Sakshi
Sakshi News home page

నారాయణ కాలేజిలో ఫుడ్‌ పాయిజన్‌

Jan 20 2017 8:49 AM | Updated on Sep 5 2017 1:42 AM

నారాయణ కాలేజిలో ఫుడ్‌ పాయిజన్‌

నారాయణ కాలేజిలో ఫుడ్‌ పాయిజన్‌

పట్టణానికి చేరువలోని కాలురు గ్రామంలో గల నారాయణ జూనియర్‌ కాలేజీలో శుక్రవారం ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది.

తిరుపతి: కాలూరు క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న నారాయణ జూనియర్‌ కాలేజీలో హాస్టల్లో విషాహారం తీసుకుని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి హాస్టల్‌లో పులిసిన పెరుగన్నం పెట్టడంతో అది తిన్న 30 మంది విద్యార్థులకు తెల్లవారుజామునుంచి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ప్రారంభమయ్యాయి. దీంతో హాస్టల్‌ సిబ్బంది విద్యార్థులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. 
 
20 మంది విద్యార్థులను తిరిగి కళాశాలకు తీసుకెళ్లగా మరో పది మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్‌ వద్దకు చేరుకున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఇలా నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement